పోటీ నుంచి త‌ప్పుకున్నారా.? త‌ప్పించారా.?

బీజేపీ అభ్యర్థుల తుది జాబితా కూడా విడుదలైంది. శుక్రవారం ఉదయం 14 మంది అభ్యర్థులతో

By Medi Samrat  Published on  10 Nov 2023 2:30 PM GMT
పోటీ నుంచి త‌ప్పుకున్నారా.? త‌ప్పించారా.?

బీజేపీ అభ్యర్థుల తుది జాబితా కూడా విడుదలైంది. శుక్రవారం ఉదయం 14 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. మాజీ ఎంపీ విజయశాంతి పేరు కనిపించకపోవడంతో.. ఆమె అసెంబ్లీ బరిలో లేనట్టే అని కన్ఫమ్ అయింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆసక్తి చూపడం లేదని, మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేయాలని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలపై విజయశాంతి మౌనం దాల్చడం, పార్టీపైనే పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో.. ఆమె పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. బీజేపీ శుక్రవారం 14 మందితో అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసింది. అంతకు ముందే 100 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలను జనసేనకు కేటాయించింది.

కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో.. పటాన్‌చెరు నుంచి కట్టా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్లు కేటాయించింది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. 13వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా, 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు రానున్నాయి.

Next Story