వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం : అఖిలేష్‌ యాదవ్‌

BJP has started counting its days SP leader Akhilesh Yadav. బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

By Medi Samrat  Published on  18 Jan 2023 5:28 PM IST
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం : అఖిలేష్‌ యాదవ్‌

బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది. ఈ స‌భ‌కు బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌తో పాటు ఆప్ జాతీయాధ్య‌క్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా స‌భ‌కు హాజ‌రైన‌ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. రైతులకు సరైన మద్ధతు ధర లభించట్లేదు. రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని ప్ర‌శ్నించారు. గంగా ప్రక్షాళన చేస్తామని నమ్మక ద్రోహం చేశారని విమ‌ర్శించారు. తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోంది. బీజేపీని గద్దె దించేందుకు కలిసి పనిచేస్తాం. ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు.




Next Story