అమిత్ షా మీద ఫేక్ వీడియో బీజేపీ సృష్టే: తెలంగాణ కాంగ్రెస్‌

బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీపీసీసీ లీగల్‌ అడ్వైజర్‌, స్పోక్స్‌ పర్సన్‌ ఎం రామచంద్రారెడ్డి అన్నారు.

By అంజి  Published on  1 May 2024 5:39 PM IST
BJP, fake video, Amit Shah, Telangana, Congress

అమిత్ షా మీద ఫేక్ వీడియో బీజేపీ సృష్టే: తెలంగాణ కాంగ్రెస్‌

బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీపీసీసీ లీగల్‌ అడ్వైజర్‌, స్పోక్స్‌ పర్సన్‌ ఎం రామచంద్రారెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌కు వచ్చి.. అమిత్‌షాపై ఎడిటెడ్‌ వీడియో కేసులో నోటీసులు ఇచ్చారని తెలిపారు. పోలీసులు ఇచ్చిన URL లింక్ ను పూర్తిగా పరిశీలించి దానిలోని విషయాలను తెలుసుకొని పూర్తి వివరాలతో వారి నోటీసుకి సమాధానం ఇవ్వటానికి 15 రోజుల టైం అడిగామని తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్త గీతా ఇంటికి మహిళా పోలీసులు లేకుండా వెళ్లి ఆమె ఫోన్ ని సీజ్ చేశారన్న రామచంద్రారెడ్డి.. ఆమెను భయబ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మహిళ దగ్గరికి మహిళ పోలీసులు వెళ్ళాలి కానీ మగ పోలీసులు వెళ్లారని, ఇది మహిళ హక్కులకు భంగం కలిగించే విషయమని అన్నారు. మేల్ పోలీసులను ఎందుకు పంపారని ప్రశ్నించారు. 41crpc నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను భయపెడుతున్నారని అన్నారు. పరిధి దాటి ప్రవర్తించే వారిపై చట్ట పరమైన చర్యలు కాంగ్రెస్ తీసుకుంటదన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మోడీ పురుష పదజాలం వాడుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు కోదండ రెడ్డి అన్నారు. హోమ్ మినిస్టర్ ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాట్లేదన్నారు. కాంగ్రెస్ ను బలహీన పరచడానికి బీజేపీ వాళ్ళు నోటీసులు పంపారని, బీజేపీ తీరు అందరికి అనుమానంగా ఉందన్నారు.

మోదీ మళ్ళీ గెలవడానికి కుట్రలు చేస్తున్నాడని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి అన్నారు. అమిత్ షా మీద ఫేక్ వీడియో బీజేపీ సృష్టేనని అన్నారు. నోటీసులలో గీత పేరు లేదని, ఆమె ఫోన్ ఎందుకు సీజ్ చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వస్తుంటే తెలంగాణ పోలీసులు ఏమి చేస్తున్నారని, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులను భయ పెట్టాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

Next Story