బండి సంజయ్ గృహ నిర్భంధం
BJP Chief Bandi Sanjay House Arrest Over.భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హౌస్
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2022 10:48 AM ISTభారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఇందుకు సిద్దం అవుతుండగా.. అక్కడికి వెళ్లకుండా బండి సంజయ్‌ను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.
విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏది ఏమైనా జేబీఎస్ వద్ద నిరసన తెలిపి తీరుతామని తేల్చి చెబుతున్నారు నేతలు.
ఇక దీనిపై బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా..? ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా..? టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచింది. పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..? మండిపడ్డారు.
టీఆర్ఎస్ సర్కారు వచ్చినప్పటి నుంచి 60 శాతం చార్జీలను పెంచింది. పేదలు గరీబ్ రథంగా భావించే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల కేసీఆర్ పేదల ఉసురుపోసుకోక తప్పదు. మేం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెళ్లట్లేదు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 10, 2022
ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది..? pic.twitter.com/kipNs1PnBp
టీఆర్ఎస్ సర్కారు వచ్చినప్పటి నుంచి 60 శాతం చార్జీలను పెంచింది. పేదలు గరీబ్ రథంగా భావించే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల కేసీఆర్ పేదల ఉసురుపోసుకోక తప్పదు. మేం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెళ్లట్లేదు. ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది..? అంటూ ప్రశ్నించారు. రేపిస్టులను అరెస్టులు చేయడం చేతకాదు కాని, పోలీసులు.. బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడించడం ఏంటి..? రాజకీయ పార్టీలు ఇండ్లు ముట్టడించడం చూశాం.. కాని, పోలీసులే ఇలా ఇండ్లను ముట్టడించడం టీఆర్ఎస్ హయాంలోనే చూస్తున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో @BJP4Telangana ఉద్యమాన్ని ఆపలేరు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 10, 2022
ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరని బండి సంజయ్ ట్వీట్లు చేశారు.