ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుండి బైంసా ప్రజలను వేరు చేయలేరు

BJP Cheif Bandi Sanjay Fire On TRS. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ విడత యాత్రను సోమవారం నుంచి ప్రారంభించాలని

By Medi Samrat  Published on  28 Nov 2022 10:29 AM GMT
ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుండి బైంసా ప్రజలను వేరు చేయలేరు

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ విడత యాత్రను సోమవారం నుంచి ప్రారంభించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో అనుమతి రద్దు చేయడంతో బండి సంజయ్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. బండి యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, భైంసా సిటీలోకి పాదయాత్ర ఎంటర్ కాకూడదని, సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభను ఏర్పాటు చేసుకోవాలని షరతులు విధించింది. పాదయాత్రకు హైకోర్టు అనుమతినివ్వగా.. బహిరంగ సభకు మాత్రం షరతులు విధించింది. భైంసా సిటీలోకి యాత్ర ప్రవేశించకూడదని, సిటీకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభ పెట్టుకోవాలని షరతులు విధించింది. లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు హైకోర్టు బెంచ్ సూచించింది.

కరీంనగర్ నుండి నిర్మల్ బయలుదేరి వెళ్లారు బండి సంజయ్. ఆయనకు ఘన స్వాగతం పలికాయి బీజేపీ శ్రేణులు. బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నామని.. పూజలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. సభ నిర్వహించుకోవాలని అనుమతిచ్చి... ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారని అన్నారు. ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర జరిగింది. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్రను కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నించిందని ఆరోపించారు బండి సంజయ్. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తామని అన్నారు. బైంసాను బండి సంజయ్ కు దూరం చేశారేమో.... కానీ బైంసా ప్రజల నుండి బండి సంజయ్ ను దూరం చేయలేరని అన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుండి బైంసా ప్రజలను వేరు చేయలేరన్నారు. బైంసాకు అసలు ఎందుకు వెళ్లకూడదు? బైంసాకు వెళ్లడానికి వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? అని ప్రశ్నించారు. అసలు బైంసాలో అల్లర్లు సృష్టించింది ఎవరని.. బైంసాలో అమయాకుల ఉసురు తీసిందెవరు? కేసులు పెట్టి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.


Next Story