లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారే ఇందులో ముగ్గురు ఉన్నారు. ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది.