మాకు లండన్, సియోల్ అక్కర్లేదు.. హైదరాబాద్‌ను హైదరాబాద్ లానే ఉంచండి : బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి

లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కదా.. ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా రేవంత్ రెడ్డి..? అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి ప్ర‌శ్నించారు

By Medi Samrat  Published on  25 Oct 2024 6:17 PM IST
మాకు లండన్, సియోల్ అక్కర్లేదు.. హైదరాబాద్‌ను హైదరాబాద్ లానే ఉంచండి : బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి

లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కదా.. ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా రేవంత్ రెడ్డి..? అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి ప్ర‌శ్నించారు. నాడు మీ కాంగ్రెస్ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చింది. నేడు అవీ ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్ప గలరా..? అంటూ ప్ర‌శ్నించారు. మూసీ సుందరీకరణను ఏటిఎంలాగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా..? అని అడిగారు. కమీషన్లు, అక్రమ సంపాదన కోసం పేదల ఇండ్లను కూలుస్తామంటే ఉపేక్షించేది లేదన్నారు.

మాకు లండన్, సియోల్ అక్కర్లేదు.. హైదారాబాద్‌ను హైదరాబాద్ లాగానే ఉంచండి చాలు అన్నారు. గత సీఎం కేసీఆర్ నగరాన్ని ఇస్తాంబుల్ లాగా మారుస్తామని చెప్పుకున్నారు.. నేడు రేవంత్ లండన్, సియోల్ అంటున్నారని అన్నారు. రేవంత్ సర్కార్ కు పేదల భూములే కనిపిస్తున్నాయా.? ఎంఐఎం నేతల అక్రమ నిర్మాణాలు, భూములు కనిపించడం లేదా..? అని ప్ర‌శ్నించారు. ఎంఐఎం బ్రధర్స్ వద్దకు వెళ్లేందుకు రేవంత్ సర్కారుకు దమ్ముందా..? అని స‌వాల్ విసిరారు. డీపీఆర్.. లేకుండా ఎలా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story