రైతన్నలకు గుడ్‌న్యూస్..'రేపే భూ భారతి పోర్టల్' ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి పోర్టల్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.

By Knakam Karthik
Published on : 13 April 2025 7:57 AM IST

Telangana, Congress Government, Bhu Bharati portal, Cm Revanthreddy

రైతన్నలకు గుడ్‌న్యూస్..'రేపే భూ భారతి పోర్టల్' ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి పోర్టల్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు రూపొందిన భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతో రూపొందించిన భూభారతి పోర్టల్ పై మంత్రి పొంగులేటితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

"భూ భారతి పైలట్ ప్రాజెక్ట్‌గా తెలంగాణలో మూడు మండలాలను ఎంపిక చేసి, వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సుల ద్వారా భూ భారతి పోర్టల్ గురించి రైతులు, ప్రజలకు సమగ్రంగా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయాలి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలి. భూ భారతి పోర్టల్ సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండాలి. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. సాంకేతికంగా బలమైన వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లతో భూ భారతి పోర్టల్‌ను నిర్వహించాలి. భూ భారతి పోర్టల్ ప్రజలకు సేవలను సులభతరం చేయడంతో పాటు, వారి భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం మెరుగుపరచాలి" అని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Next Story