భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద హడలెత్తించిన కొండచిలువ

భద్రాచలంలో గోదావరి నది స్నానఘట్టాల సమీపంలోని దుకాణాల వద్ద కొండచిలువ కనిపించి హడలెత్తించింది.

By -  Medi Samrat
Published on : 14 Sept 2025 7:07 PM IST

భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద హడలెత్తించిన కొండచిలువ

భద్రాచలంలో గోదావరి నది స్నానఘట్టాల సమీపంలోని దుకాణాల వద్ద కొండచిలువ కనిపించి హడలెత్తించింది. స్థానిక వ్యాపారులు, భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే భయాందోళనకు గురైన స్థానికులు ఆ కొండచిలువను చంపేశారు. స్నానఘట్టాల వద్ద వ్యాపారులు ఉదయం తమ దుకాణాలను తెరుస్తుండగా, ఓ షాపులో నక్కి ఉన్న కొండచిలువను గమనించారు. పెద్ద పామును చూసి వారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దానిని కర్రలతో కొట్టి చంపేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నదికి వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ వరద నీటి ప్రవాహానికి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చెత్తాచెదారంతో పాటు విష సర్పాలు, కొండచిలువలు వంటివి కొట్టుకొస్తున్నాయి. ఏవైనా జంతువులు కనిపిస్తే వాటికి హాని చేయకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Next Story