రేపు ఉదయం 10:30 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ కానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏప్రిల్ 8న బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి ధన్యవాదాలు తెలపనున్నారు.
ఉదయం రాజ్ భవన్ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ ,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు , కేశవరావు , మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య , దండే విఠల్ ,విజయశాంతి, నారాయణ,ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాకటి శ్రీహరి, మక్కన సింగ్ రాజ్ ఠాకూర్, ఈర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్ , కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.