పవన్ కళ్యాణ్ కు బర్రెలక్క సపోర్ట్

ఇటీవల పలాస బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతూ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2023 8:30 PM IST
పవన్ కళ్యాణ్ కు బర్రెలక్క సపోర్ట్

ఇటీవల పలాస బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో పోటీ చేసి పవన్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో పవన్ డైలాగులు కొట్టారని, ఆఖరికి ఆయనకు డిపాజిట్లు రాలేదని అన్నారు. ఇండిపెండెంట్‌ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదన్నారు. ఆయన ఒక నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు సీఎం జగన్.

బర్రెలక్క తాజాగా ఓ కార్యక్రమానికి హాజరై స్పందించింది. ఎవరి పార్టీ వారిది, ఎవరి రాజకీయ జీవితం వారిదని బర్రెలక్క చెప్పింది. పవన్ కళ్యాణ్‌ను తక్కువచేసి మాట్లాడటం బాధగా అనిపించిందని.. ఆయన పవర్ ఆయనది.. నా పవర్ నాదని తెలిపింది. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకొచ్చింది. ఆయన ఎంత మంచోడో జనాలకు తెలుసని, ఆయనను తక్కువ చేసి మాట్లాడం కోసం తనతో పోల్చడం బాధగా ఉందన్నారు.

Next Story