మంత్రి రోజా, కేటీఆర్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డ బండ్ల గ‌ణేష్‌

తండ్రి పేరు అడ్డుపెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని కాంగ్రెస్ నేత‌ బండ్ల గణేష్ అన్నారు.

By Medi Samrat  Published on  27 Feb 2024 1:52 PM IST
మంత్రి రోజా, కేటీఆర్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డ బండ్ల గ‌ణేష్‌

తండ్రి పేరు అడ్డుపెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని కాంగ్రెస్ నేత‌ బండ్ల గణేష్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేసీఅర్ గారి అబ్బాయిగా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపు లేదన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పోరాట యోధుడు అన్నారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందన్నారు. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నాడని అన్నారు. కేటీఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ తో డిబేట్ కోసం హరీష్ సెట్ అవుతున్నాడని అన్నారు. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని తిట్టిస్తున్నారని మండిప‌డ్డారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ కోసం కేటీఆర్ కాల్ చేస్తే బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని అన్నారు. మేం ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ ఇచ్చామ‌న్నారు. అందుకే కాంగ్రెస్‌లో సీట్ల కోసం పోటీ ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. మీ హాయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్ కౌంటర్ చేయించే వాళ్ళు.. రాళ్లతో కొట్టి చంపించే వాళ్ళన్నారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్ళారన్నారు. కేటీఆర్ హాయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్ల దనం దొరుకుతుంద‌న్నారు.

రోజా డైమండ్ రాణి అని కామెంట్ చేశారు. రేవంత్ ఫైటర్.. జగన్ ఆక్సిడెంటల్‌ సీఏం సీఎం అని వ్యాఖ్యానించారు. నాన్నగారు చనిపోతే సీఏం అయిన వ్యక్తులు ఉన్నారని అన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి పులుసు పాప అని ఏపీ మంత్రి రోజాపై సెటైర్లు వేశారు. రోజా ఐటం రాణి అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారని ప్ర‌శ్నించారు. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా.? అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ కూలిపోతే మాదే బాధ్యత అని బీఆర్ఎస్ చెప్పాలన్నారు. పనికిరానప్పుడు తీసేయడం తప్పా ఏం చేస్తారు.. మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా కాపాడుతున్నామ‌న్నారు.


Next Story