గాంధీ భవన్‌లో బండ్ల గణేష్.. మిత్రుడు నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టింది..!
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 8 Nov 2023 5:06 PM ISTసినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.గతంలో ఆయనకు టీపీసీసీలో కీలక పదవికి ఇచ్చారు. కానీ ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకుని కొంతకాలం సైలెంట్‌గా ఉన్నారు. కొన్నరోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన గాంధీభవన్ వచ్చారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడే షాద్ నగర్ పోయిన.. మిత్రుడు వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టిందన్నారు.
జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.. సోషల్ మీడియాను, నాయకులను మేనేజ్ చేయచ్చు కానీ.. ప్రజలను మేనేజ్ చేయలేరని బీఆర్ఎస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30 కోసం ఎదురు చూస్తున్నారు.. కాంగ్రెస్ అద్భుతం స్తృష్టిస్తుందని జోష్యం చెప్పారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందన్నారు.
దేశం కోసం రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ సేవ చేస్తున్నారు.. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయం అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.. అన్నింటికీ తెగించి తెలంగాణ ఇచ్చింది అమ్మ.. రాహుల్ గాంధీ తెలంగాణాలోనే మాకాం వేస్తారని చెప్పారు.
రాహుల్ గాందీ ఏనాడు హద్దులు దాటి మాట్లాడలేదు.. బీఆర్ఎస్ లో మంత్రులు ఎవరు.? కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదన్నారు. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామన్నారు. నేను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తని..ఇంత వరకూ కాంగ్రెస్ కు తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని బండ్ల గణేష్ అన్నారు.