రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రంగరాజన్‌పై దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించినట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఆయనకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీసినట్లు చెప్పారు.
కాగా రామరాజ్యం స్థాపనకు మద్దతు నిరాకరించడంతో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన అనచరులు 20 మందితో కలిసి చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయనపై దాడి ఘటనను హిందూ సంఘాలు ఖండించాయి. ఈ నేపథ్యంలోనే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, నాయకులు పరామర్శించారు.