ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే.. కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వదు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇచ్చే ఇళ్లకు 'ఇందిరమ్మ’ పేరు పెట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  25 Jan 2025 5:33 PM IST
ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే.. కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వదు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇచ్చే ఇళ్లకు 'ఇందిరమ్మ’ పేరు పెట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం నిర్మించే ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ప్రాధాన్యత లభించింది. దేశవ్యాప్తంగా కోట్లాది పేద కుటుంబాలు ఇంటి యజమానులుగా మారాయి. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేకుండా ఈ ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడుతోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

కరీంనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు అని ఎలా పేరు పెట్టింది? ఇందిరమ్మ ఇల్లు పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని కొనసాగిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా కేటాయించదని బండి సంజయ్ హెచ్చరించారు. పీడీఎస్ కింద ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం అంశాన్ని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తారు. పీడీఎస్‌ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని సాక్షాత్తూ మోదీ సర్కార్‌ భరిస్తుండగా, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పేరు చెప్పుకుంటోందన్నారు.

Next Story