కేసీఆర్ ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతాం : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay Sensational Comments On CM KCR. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద బడుగుల
By Medi Samrat Published on 30 July 2021 10:52 AM GMTతెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని.. ఆ భూమిని బడుగువర్గాలకు పంచుతామని అన్నారు.
పోడు భూముల పరిష్కారం, దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పిన కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే బలహీన వర్గాలకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామని చెప్పారు. ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు, రూ.30 లక్షలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 18శాతం ధళితులు ఉన్నారని.. వారిలో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు లేవా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఫేక్ ఐడీలు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారని అన్నారు.
హుజూరాబాద్ లో జరుగుతున్నది బైపోల్స్ కాదని... కేసీఆర్ బైయింగ్ పోల్స్ అని సంజయ్ మండిపడ్డారు. ఓటర్లను లోబరుచుకునేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చేసినా బీజేపీ గెలుపును కేసీఆర్ అడ్డుకోలేరని అన్నారు. ఈటల బావమరిది చాటింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన నిజంగా తప్పు చేసినట్టైతే ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.