కేసీఆర్ కుటుంబం దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉంది : బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  16 Dec 2023 8:32 PM IST
కేసీఆర్ కుటుంబం దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉంది : బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నాయకుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని.. లేదంటే వారు దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని త్వరగా బయటపెట్టి.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్ పోర్టులను రేవంత్ ప్రభుత్వం సీజ్ చేయాలని.. లేదంటే విదేశాలకు పారిపోయే అకాశముందని హెచ్చరించారు. ఈ అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎంగా ఉండగా సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారని ఆరోపించారు. వాళ్ల పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలని అన్నారు.

Next Story