తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ కు ఎంపీ బండి సంజయ్ కి మధ్య గొడవలు ఉన్నాయని గత కొన్ని నెలలుగా ప్రచారం సాగుతూ ఉంది. రెండు వర్గాలుగా బీజేపీ నేతలు విడిపోయారంటూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ఓపెన్ అయ్యారు. తనకు ఈటలకు మధ్య ఎలాంటి గొడవలు.. కోల్డ్ వార్ లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 200 యూనిట్లకు, 500గ్యాస్ సిలిండర్ హామీలకు వ్యతిరేకం కాదన్నారు. మ్యానిఫెస్టోలో రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకే అని చెప్పలేదని.. అందరికీ స్కీంలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ప్రజలు బతుకులు నాశనం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకరికొకరు ఆరోపణలు చేసుకొని ప్రజల దృష్టి మల్లిస్తారన్నారని విమర్శించారు. భాష విషయంలో హద్దు మీరి అహంకారంతో మాట్లాడద్దన్నారు బండి సంజయ్.
నియోజకవర్గ అభివృద్ధికి , ప్రజల హక్కులు, పేపర్ లీకేజీలు, స్టూడెంట్స్ ఆత్మహత్యలపై పోరాడింది తానేనని చెప్పుకొచ్చారు బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల కోసం పని చేసేలా చేసింది తానేనన్నారు. ఈటలకి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈటల రమ్మనలేదు కాబట్టే రాలేదన్నారు.