7 నుంచి బండి సంజ‌య్ పాదయాత్ర

తెలంగాణ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

By Medi Samrat  Published on  4 Nov 2023 6:45 PM IST
7 నుంచి బండి సంజ‌య్ పాదయాత్ర

తెలంగాణ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సీనియ‌ర్ నేత‌ బండి సంజ‌య్‌ను మ‌రోమారు రంగంలోకి దించ‌నుంది బీజేపీ అధిష్టానం. బండి సంజ‌య్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయ‌న చేసిన‌ పాదయాత్ర పార్టీకి ప్ల‌స్సైంది. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో మరోమారు ఆయనను వాడుకోవ‌డానికి అధిష్టానం సిద్దమైంది.

బండి సంజ‌య్ పాదయాత్ర న‌వంబ‌ర్ 7న ప్రారంభం కానుంది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ కరీంనగర్ నుంచే యాత్ర మొద‌లుకానుంది. ఎన్నికలకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో బండి సంజ‌య్ పాదయాత్ర పార్టీకి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌నుంది. ఏడో తేదీన కరీంనగర్‌, 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో బండి సంజ‌య్ పాద‌యాత్ర ఉండనుంది.

Next Story