చర్చకు సిద్ధమా.? టీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్‌

Bandi Sanjay Fires On TRS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని

By Medi Samrat  Published on  12 Sep 2021 8:58 AM GMT
చర్చకు సిద్ధమా.? టీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్‌కు సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారన్నారని విమర్శించారు. బండి సంజ‌య్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 16వ రోజు కొనసాగుతోంది. మెదక్‌ జిల్లాలో యాత్ర సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. బీజేపీని ఆదరిస్తున్నారని వివరించారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక హోదా తీసుకురాలేకపోతే.. కేంద్రం నుంచే తీసుకొస్తామని సంజయ్‌ చెప్పారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేయించాలని, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి.. కేంద్రం ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టాలని కోరారు.

రజాకార్ల చేతిలో బలైన కుటుంబాలకు ప్రభుత్వం సన్మానం చేయాలన్నారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. ఈ నెల 17న పాదయాత్రలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొంటారని బండి సంజయ్‌ చెప్పారు.Next Story
Share it