కేసీఆర్.. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? : బండి సంజ‌య్

కేసీఆర్.. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? అని బీజేపీ నేత బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు.

By Medi Samrat  Published on  5 Nov 2023 6:51 PM IST
కేసీఆర్.. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? : బండి సంజ‌య్

కేసీఆర్.. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? అని బీజేపీ నేత బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. మేడిగడ్డకు వచ్చే దమ్ముందా..? ఇరిగేషన్ నిపుణులను తీసుకొస్తా. వాస్తవాలు బయటపెడదాం రా.. అని స‌వాల్ విసిరారు. అసలు కేసీఆర్ మేడిగడ్డపై ఎందుకు నోరు మెదపడం లేదు? అని స్ర‌శ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఆస్తులను జప్తు చేస్తామ‌న్నారు.

రేవంత్ రెడ్డి బలి పశువు కాబోతున్నరని జోష్యం చెప్పారు. దేశమంతా కాంగ్రెస్ కు మద్దతిస్తాం.. రేవంత్ సీఎం కావొద్దని ముస్లిం పెద్దలంతా రాహుల్ ను కలశారని.. రాహుల్ అందుకు ఓకే అన్నారని పేర్కొన్నారు. బీసీలారా.. ఎల్లుండి జరిగే మోదీ సభకు తరలిరండి. బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లను పాతరేయండని పిలుపునిచ్చారు.

బీసీని సీఎం చేస్తామంటే విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. బీసీలను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేయండి. రేపు నామినేషన్ వేస్తున్నా.. ఆశీర్వదించాలని కోరారు.

Next Story