దీక్ష భ‌గ్నం.. బండి సంజ‌య్ అరెస్ట్‌

Bandi Sanjay arrested in Jangaon District.భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Aug 2022 5:38 AM GMT
దీక్ష భ‌గ్నం.. బండి సంజ‌య్ అరెస్ట్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్ మండ‌లం పామ్నూరు వ‌ద్ద బండి సంజ‌య్ మంగ‌ళ‌వారం చేప‌ట్టిన దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, అక్ర‌మ అరెస్టుల‌కు నిర‌స‌న‌గా ఆయ‌న దీక్ష‌కు ఉప‌క్ర‌మించారు. దీక్ష‌ను భ‌గ్నంచేసి బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌గా.. పోలీస్ వాహ‌నాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్ర‌మంలో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. దీంతో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దల బండి సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం పాత్రను తేల్చేంత వరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

Next Story
Share it