అందుకే కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటారని మాకు అనుమానం ఉంది : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  30 Oct 2024 12:00 PM GMT
అందుకే కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటారని మాకు అనుమానం ఉంది : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోవని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బీఆర్ఎస్ ఆంబోతు కౌశిక్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతుంది.. ఈ ఆంబోతుని స‌ద‌ర్‌కు తీసుకెళ్ళమని అనిల్ యాదవ్‌కు చెప్తాన‌ని అన్నారు.

కొకైన్ పాజిటివ్ ఎవరికి వచ్చింది.. పార్టీ ఎక్కడ జరిగింది.. ఎవరెవరు పార్టీ లో ఉన్నారని చెప్పకుండా ఇష్యూను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ఫ్రెండ్స్, దగ్గర మిత్రులు డ్రగ్స్ తీసుకుంటారు.. కాబట్టి మాకు కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటారని అనుమానం ఉంది.. దాన్ని నివృత్తి చేయడం లేదన్నారు. విజయ్ మద్దూరి మాకు దగ్గర అని కేటీఆర్ చెప్పారు.. విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది కాబట్టి కేటీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.

పదేండ్లు నేను చేసిన పనిని.. ఉద్యమాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది.. ప్రజల సమస్యల మీద నేను పోరాటం చేసినందుకు అప్పటి మీ ప్రభుత్వం నా మీద 88 కేసులు పెట్టింది.. ఇది నా చరిత్ర.. నీ చరిత్ర ఎంటిదో నేను చెప్పాలా కౌశిక్ రెడ్డి..? నీకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మద్దతు ఇచ్చింది బలమూరి వెంకట్.. నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 50,000 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీ విషయాలు లీక్ చేసావు.. నీకు ఎమ్మెల్సీ పదవీ ఎలా వచ్చింది.. ఇక్కడ విషయాలు అక్కడ లీకులు ఇచ్చినందుకు నీకు ఎమ్మెల్సీ పదవీ వచ్చింది. తెలంగాణ ఉద్యమ కారుల మీద రాళ్ళు రువ్విన నీకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ విన్న విషయాలు అన్నీ పక్క పార్టీకి లీక్ చేసిన వాడివి నువ్వు.. మీ పదేండ్ల పాలన మీద.. మా పది నెలల పాలన మీద నేను చర్చ కు రెడీ అని స‌వాల్ విసిరారు.

కేటీఆర్ కు నిజంగా డ్రగ్స్ తీసుకోవడం అలవాటు లేకపోతే డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారా లేదా అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అరేయ్ కౌశిక్ ముందు నియోజక వర్గ సమస్యలు ముందు పరిష్కారం చెయ్.. మేము అపోలో హాప్సిటల్ కు వచ్చి శాంపిల్ ఇచ్చాము.. మీరు కూడా శాంపిల్ ఇవ్వండి.. రిపోర్ట్ జనాల ముందు బయట పెట్టండి.. కౌశిక్ నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చ‌రించారు.

Next Story