బాల్క సుమన్‌ అరెస్ట్

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  21 Jun 2024 11:28 AM GMT
బాల్క సుమన్‌ అరెస్ట్

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం, ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు బాల్క సుమన్ ఆందోళన చేశారు. బాల్క సుమన్, మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రిని కలవాలంటూ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. “సీనియర్ నాయకుడు పి.శ్రీనివాస్ రెడ్డి నైపుణ్యం సూచనలు రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతికి, కాంగ్రెస్‌కు సహాయపడతాయి. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీనియర్ నేతలందరి సహకారం అవసరమని సీఎం రేవంత్ అన్నారు. వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించిన విధివిధానాలపై ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీనియర్‌ నేత పీ శ్రీనివాస్‌రెడ్డి సహకారం దోహదపడుతుందని సీఎం రేవంత్‌ అన్నారు.

Next Story