పెట్రోల్ బంకులో యువ‌కుల‌ వీరంగం.. బ‌రితెగించి పిల్లింగ్ వర్కర్‌పై దాడి

Attack On Bunk Worker. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో ఆదివారం ముగ్గురు యువకులు పిల్లింగ్ వర్కర్ పై దాడికి దిగారు

By Medi Samrat  Published on  7 March 2021 10:50 AM GMT
Attack On Bunk Worker

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో ఆదివారం ముగ్గురు యువకులు పిల్లింగ్ వర్కర్ పై దాడికి దిగారు. వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు 50 రూపాయల పెట్రోల్ పోయాలంటూ డిమాండ్ చేయగా.. రూ. 100 లోపు డిజిటల్ చెల్లింపులకు పెట్రోల్ పోసేది లేదంటూ బంక్ సిబ్బంది తెలిపారు.

దీంతో రూ. 100 పెట్రోల్ పోయగా యువకులు రూ. 50 మాత్రమే ఇచ్చారు. మిగతా 50 రూపాయల విషయంలో గొడవ తలెత్తగా ఆ యువకులు పెట్రోల్ బంకు సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి దిగారు. ఈ సంఘటన మొత్తం పెట్రోల్ బంకులోని సిసి కెమెరాలలో రికార్డ‌యింది. ఈ మేరకు పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.Next Story
Share it