ఎమ్మెల్సీ కవితకు మరో షాక్

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితకు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు. ఆమెపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు మే 29న పరిగణలోకి తీసుకుంది.

By Medi Samrat  Published on  29 May 2024 11:25 AM GMT
ఎమ్మెల్సీ కవితకు మరో షాక్

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితకు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు. ఆమెపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు మే 29న పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కవిత బెయిల్ పై బయటకు వస్తారని ఓ వైపు బీఆర్ఎస్ వర్గాలు ఆశలు పెట్టుకోగా.. ఇంతలో ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోవడం షాకింగ్ అంశమే!! అంతేకాకుండా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ జూన్‌ 3న కోర్టుకు రావాలని వారెంట్‌లు జారీ చేసింది. కవితను కూడా ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత మధ్యంతర బెయిల్ పై మే 28వ తేదీ మంగళవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు.


Next Story