తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ నేతలు కలుస్తూ ఉన్నారు. తాజాగా చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. అయితే ఆయన తాజాగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
మర్యాదపూర్వకంగా మాత్రమే తెలంగాణ సీఎంను కలిసినట్లు యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయమని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుండటం ఆ పార్టీలో కాస్త టెన్షన్ కు కారణమవుతూ ఉంది. ఇప్పటికే పలువురు నేతలు గులాబీ కండువాను వదిలేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది కాంగ్రెస్ కు దగ్గరవుతారోనని చర్చలు జరుగుతూ ఉన్నాయి.