రుణమాఫీపై ప్రకటన అతి త్వరలోనే..!

రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నామని.. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By Medi Samrat  Published on  3 July 2024 2:19 PM GMT
రుణమాఫీపై ప్రకటన అతి త్వరలోనే..!

రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నామని.. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంపద సృష్టిస్తామని.. దాన్ని ప్రజలకు పంచుతామన్నారు భట్టి. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని.. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని తెలిపారు. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో సొంత సొంత నిర్ణయాలు ఉండవని.. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తామన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే తమ ఆలోచన అని.. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు భట్టి విక్రమార్క. 15 సంవత్సరాలు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్‌వి కల్లిబొల్లు కబుర్లే అని కొట్టి పారేశారు. క్యాబినెట్ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు భట్టి విక్రమార్క.

Next Story