హైకోర్టును ఆశ్రయించిన యాంక‌ర్ ర‌ఘు భార్య‌..

Anchor Raghu Wife Went to High Court Over Her Husband Arrest. యాంక‌ర్‌ రఘు భార్య లక్ష్మీప్రవీణ‌ హైకోర్టును ఆశ్రయించింది. తన భ‌ర్త రఘును

By Medi Samrat  Published on  5 Jun 2021 3:09 AM GMT
హైకోర్టును ఆశ్రయించిన యాంక‌ర్ ర‌ఘు భార్య‌..

హైదరాబాద్ : యాంక‌ర్‌ రఘు భార్య లక్ష్మీప్రవీణ‌ హైకోర్టును ఆశ్రయించింది. తన భ‌ర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కోర్టులో రిట్ పిటిష‌న్ దాఖలు చేశారు. లక్ష్మీప్రవీణ‌ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. ప్రతివాదుల‌కు నోటీసులిచ్చింది. రఘు అరెస్ట్ అక్రమ‌మో.. కాదో తేలుస్తామ‌ని హైకోర్టు పేర్కొంది. ఇక‌ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాల‌ని హైకోర్టు సూచించింది.

ఇదిలావుంటే.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రఘును మధ్యలో అడ్డుకుని జీపులో ఎక్కించారు. పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్న తీరు.. అరెస్ట్‌కు ముందు కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో.. కిడ్నాప్‌కు గుర‌య్యారంటూ అంటూ కలకలం రేగింది.
Next Story
Share it