ఇదెక్కడి న్యాయం.. కేటీఆర్ సర్‌: యాంకర్‌ అనసూయ

Anasuya tweets to ts minister ktr. విద్యార్థుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయంపై నటి, ప్రముఖ యాంకర్‌

By అంజి  Published on  29 Oct 2021 1:01 PM IST
ఇదెక్కడి న్యాయం.. కేటీఆర్ సర్‌: యాంకర్‌ అనసూయ

విద్యార్థుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయంపై నటి, ప్రముఖ యాంకర్‌ అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులను స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని అన్నారు. విద్యార్థుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వకుండా.. తల్లిదండ్రులను పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నాయని అనసూయ అన్నారు. ఇదే విషయమూ అనసూయ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

'' కేటీఆర్‌ సర్‌.. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ పాటించాం.. ఆ తర్వాత ఆన్‌లాక్‌ చేశారు. అప్పటి నుండి దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సాగుతోంది. కానీ.. వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన వయసు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్‌?? పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి. పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు.. వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదని స్కూల్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి, దానికి తల్లిదండ్రులు అంగీకార పత్రాన్ని రాసివ్వాలంటూ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం చెప్పండి సర్‌? ఈ విషయాన్ని మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను" అంటూ మంత్రి కేటీఆర్‌కు అనసూయ ట్వీట్ చేశారు.


Next Story