21 ఏళ్ళకే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉండేలా సవరణ తీసుకురావాలి

An amendment should be brought to make it possible for 21-year-olds to contest as MLAs. రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తు కునేలా చేశారని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్

By Medi Samrat  Published on  22 Jan 2023 10:31 AM GMT
21 ఏళ్ళకే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉండేలా సవరణ తీసుకురావాలి

రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తు కునేలా చేశారని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆహ్వానం మేరకు ఎల్బీ స్టేడియం లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కార్యక్రమంలో ఏఐసీసీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులున్నా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో హనుమంతరావు సంపాదించింది ఏం లేదు. అందరిలో స్ఫూర్తి నింపడానికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు.

ఓటమిని కూడా గెలుపుకు పునాదిగా మార్చుకునే స్ఫూర్తి క్రీడా మైదానంలో ఉంటుంది.. అలాంటి స్ఫూర్తి రాజకీయాల్లోనూ ఉండాల్సిన అవసరం ఉందని.. గెలిస్తే పొంగిపోవద్దు, ఓడితే కుంగి పోవద్దని అన్నారు. దేశ భవిష్యత్తు యువకులదే అని గుర్తించిన నేత రాజీవ్ గాంధీ.. 21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుందించి హక్కు కల్పించిన గొప్ప నేత రాజీవ్ అని కొనియాడారు. 25 ఏళ్లకు బదులుగా 21 ఏళ్ళు నిండిన వారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉండేలా సవరణ తీసుకు రావాలని.. ఇందుకు కాంగ్రెస్ పార్టీ తరపున మేం చేయాల్సిన కృషి చేస్తామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.


Next Story