తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
By Medi Samrat
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తన అధికారిక పర్యటనలో భాగంగా, షా మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగి, అక్కడి నుండి నేరుగా నిజామాబాద్‌కు వెళ్తారు. ఉదయం 11:25లకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45కు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి వినాయక్‌నగర్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఆయన ఉండనున్నారు. 2:35కు నిజామాబాద్ కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి ధర్మపూరి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. 2: 45 నిమిషాల నుంచి 4గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు.
ఈ పర్యటనలో ముఖ్యమైన అంశాలలో ఒకటి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం. పసుపు బోర్డు ఏర్పాటు ఈ ప్రాంతంలోని పసుపు రైతుల దీర్ఘకాల డిమాండ్, ఈ ప్రారంభోత్సవం తెలంగాణలో వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా పసుపు సాగు, ఎగుమతికి ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది.