సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నారని, వేంటి లేషన్ తీసేశారని తెలిపారు. రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. అల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు, పుష్ప నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ 50 లక్షల రూపాయలు మొత్తం 2 కోట్ల రూపాయలను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు గారికి అందజేశామని తెలిపారు.