నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. 24వ తేదీ11 గంటల సమయంలో విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరు కావాలని అంతకు ముందు రోజు నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ తన ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పోలీసులు దాదాపు రెండు గంటల పాటు అల్లు అర్జున్ ని విచారణ చేశారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోలు చూపించి మొత్తం 18 ప్రశ్నలు అల్లు అర్జున్ ని అడిగారు.