కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవాళ వరకు చెల్లించక పోతే రేపటి నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివా స్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌ను తీవ్రతరం చేస్తూ, ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు నవంబర్ 6న లక్ష మంది సిబ్బందితో నిరసనకు పిలుపునిచ్చాయి. నిరసనకు ముందు, ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, MCA, BEd, మరియు నర్సింగ్ సహా కళాశాలలు నవంబర్ 3 నుండి నిరవధికంగా మూసివేయబడతాయి. కళాశాలలు విశ్వవిద్యాలయాల పరిధిలోని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.
ఫీజు రీయిం బ్స్ మెంట్ అడిగితే విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశిస్తారా అని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు కళాశాలలకు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అన్ని పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలను కోరుతు న్నాం అని తెలిపారు. నవంబర్ 6న లక్ష యాభై వేల మంది కాలేజీ స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 10 లేదా 11వ తేదీన పది లక్షల మంది విద్యా ర్థులతో హైదరాబాద్లో నిరసన తెలియజేస్తామన్నారు. ఈ నిరసన అనంత రం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడతా మని తెలిపారు. కలెక్టరేట్ల ముట్టడి. చేస్తామన్నారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్ మెయి ల్ చేయడమే అని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లింపు బాధ్యత ఎమ్మెల్యే లు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వాలు పడిపో యాయన్న విషయం గుర్తుంచుకోవా లన్నారు. కళాశాలల యాజమాన్యా లను బెదిరింపులతో భయపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని వారు హితవు పలికారు.