ఏఐసీసీ నాయకత్వం డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఎంపికలో సమర్థవంతమైన నాయకత్వానికి పట్టం కట్టబోతున్నారు. ఇక ముందు డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక భూమిక వహించబోతున్నారు. సీఈసీ సమావేశానికి వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతుంది
డీసీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం నుంచి ఏఐసీసీ అబ్జర్వర్స్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అబ్జర్వర్స్ లో మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి, సీడబ్ల్యుసీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు వంటి సీనియర్ నేతలు ఉన్నారు. డీసీసీ ఆశిస్తున్న జిల్లాల సీనియర్ నేతలు ఏఐసీసీ అబ్జర్వర్స్ ను కలిసి అప్లికేషన్స్ ఇవ్వాల్సివుంటుంది. సమర్థవంతమైన నాయకులు డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. రేపు జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో వీరు ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది.