తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల.. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తోంది. షర్మిల పాదయాత్రకు ప్రజల నుండి ఓ మాదిరిగా స్పందన వస్తోంది. ఇటీవల షర్మిల పాదయాత్రకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 8వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర.. మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. తాజాగా షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. షర్మిల పాదయాత్రకు యాంకర్ శ్యామల మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడారు. సమాజం మార్పు కోసం కృషి చేస్తున్న షర్మిల పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత 8 రోజులుగా అక్క నడుస్తున్నారని, అక్కతో కలిసి నడవడానికి తాను సిద్ధమని శ్యామల అన్నారు. ప్రతి ఒక్కరు తమ సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కూతురు, సీఎం జగన్ చెల్లెలు అయిన షర్మిల అక్క.. వారి నాన్న ఆశయ సాధన కోసం ముందుకు సాగటం గొప్ప విషయమ్నారు.