సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు రాహుల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.

By -  Knakam Karthik
Published on : 16 Sept 2025 2:09 PM IST

Hyderabad News, Cm Revanthreddy, Accident victim Rahul, Congress Government

హైదరాబాద్: కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కృతజ్ఞతలు తెలిపాడు. వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా.. రాహుల్ కు సీఎం సహాయనిధి ద్వారా చికిత్స అందించి, కృత్రిమ కాళ్లను అమర్చేందుకు ప్రభుత్వం సాయం చేసింది.

నవంబర్ 2, 2024న రైలులో రాజస్థాన్ వెళుతున్న రాహుల్ ను రైల్లో నుంచి కొందరు దుండగులు తోసేశారు. ఈ ఘటనలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్‌కు కృత్రిమ కాళ్లు అమర్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. తను మళ్లీ నడవగలిగేందుకు సహకారం అందించిన ముఖ్యమంత్రికి కుటుంబంతో కలిసి రాహుల్ ధన్యవాదాలు తెలిపాడు.

Next Story