SLBC టన్నెల్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన పైకప్పు.. లోపలే చిక్కుకుపోయిన కార్మికులు

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారని తెలుస్తోంది.

By Medi Samrat  Published on  22 Feb 2025 3:15 PM IST
SLBC టన్నెల్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన పైకప్పు.. లోపలే చిక్కుకుపోయిన కార్మికులు

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఘటనాస్థలికి వెంటనే చేరుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ 14 కిలోమీటర్ల ఇన్‌లెట్ వద్ద సీపేజ్ చేయడానికి ఉపయోగించే కాంక్రీట్ సెగ్మెంట్ జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది, హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story