మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో-2లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident In Manuguru. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో-2లో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరోపైకి
By Medi Samrat Published on
18 Aug 2021 1:02 PM GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో-2లో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరోపైకి డంపర్ దూసుకెళ్లడంతో ఇద్దరు కార్మికులతో పాటు వాహనం డ్రైవర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డంపర్ వాహనాన్ని డ్రైవర్ వెనుక్కు తీస్తుండగా అదుపుతప్పి బొలెరోపైకి దూసుకెళ్లి వాహనం నుజ్జునుజ్జవడంతో ఈ ఘటన జరిగింది. మృతులను పాషా (ఎలక్ట్రీషియన్), సాగర్ (జనరల్ మజ్దూర్), వెంకన్న (బులెరో డ్రైవర్)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు.
Next Story