హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తదుపరి విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 22న ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును మే 22న అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు 10 రోజుల కస్టడీని కోరగా, కోర్టు కేవలం 3 రోజులకే అనుమతించింది. ఉమామహేశ్వరరావుకు సంబంధించి 3.95 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.