మర్రిగుడ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ. 2 కోట్ల న‌గ‌దు గుర్తింపు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో నల్గొండ జిల్లా మర్రిగుడ తహసీల్దార్‌గా

By Medi Samrat
Published on : 30 Sept 2023 1:33 PM

మర్రిగుడ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ. 2 కోట్ల న‌గ‌దు గుర్తింపు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో నల్గొండ జిల్లా మర్రిగుడ తహసీల్దార్‌గా పని చేస్తున్న మహేందర్ రెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. హైదరాబాద్ వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయినగర్‌లో ఉన్న మహేందర్ రెడ్డి నివాసంతో పాటు 15 చోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల‌లో ఏసీబీ అధికారులు భారీగా నోట్ల కట్టలు గుర్తించారు.

మహేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన వాటిలో ఒక ట్రంకు పెట్టెలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా నగదు దొరికింది. నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న అధికారులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం మహేందర్ రెడ్డిని వనస్థలిపురం హస్తినపురం ఇంటి వద్ద నుండి వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మహేందర్ రెడ్డిని మరికాసేపట్లో న్యాయమూర్తి ఎదుట‌ హాజరు పరుచనున్నారు.

Next Story