ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

By Medi Samrat  Published on  29 Oct 2024 8:01 PM IST
ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మంగళవారం రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సయ్యద్ ఖలీలుల్లా అలియాస్ ఖలీల్, ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ అసిస్టెంట్ దామళ్ల సుధాకర్ గా గుర్తించారు. ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి తొలగించిన 23 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాల బిల్లులు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్‌ చేశారు. ఆ డబ్బును అందుకుంటుండగా ఖమ్మం అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

వీరిద్దరూ మొత్తం రూ.7 లక్షలు అడిగారు. మంగళవారం రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఖలీల్ ఆఫీసు టేబుల్ నుండి లంచం రికవరీ చేశారు. అతని కుడి చేతి వేళ్లకు చేసిన రసాయన పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. వారిద్దరినీ అరెస్టు చేసి వరంగల్‌లోని ఎస్పీ, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.

Next Story