ఏసీబీకి చిక్కిన మణుగూరు సీఐ

మణుగూరు పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), బిగ్ టీవీ రిపోర్టర్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) రూ. 1,00,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేసింది.

By Medi Samrat
Published on : 21 April 2025 7:15 PM IST

ఏసీబీకి చిక్కిన మణుగూరు సీఐ

మణుగూరు పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), బిగ్ టీవీ రిపోర్టర్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) రూ. 1,00,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేసింది. నిందితులను సోమ సతీష్ కుమార్, టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపిగా గుర్తించారు. సతీష్ కుమార్ సూచనల మేరకు గోపి, ఫిర్యాదుదారుడి నుండి మొత్తం రూ.4,00,000 లంచం డిమాండ్‌ చేశాడు. అందులో భాగంగా రూ.1,00,000 లంచం తీసుకున్నాడు.

మణుగూరు పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 329(3) మరియు తెలంగాణ రాష్ట్ర గేమింగ్ (సవరణ) చట్టం (TSGLA) సెక్షన్ 5 కింద నమోదైన కేసు నుండి ఫిర్యాదుదారుని, అతని మేనల్లుడిని మినహాయించడానికి బదులుగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ సమయంలో నిర్వహించిన రసాయన పరీక్షల్లో గోపి చేతిపైన, అతని ప్యాంటు కుడి జేబులో లంచం జాడలు ఉన్నట్లు నిర్ధారించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story