ఏసీబీ అధికారులుగా చెప్పుకుంటూ బెదిరింపులకు దిగుతున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి బెదిరింపు కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కీలక సూచన చేసింది.
“కొందరు వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్ చేయడం, ప్రభుత్వోద్యోగులను బెదిరించడం, వారిపై కేసులు నమోదు చేయనందుకు డబ్బు డిమాండ్ చేయడం వంటివి ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఏనాడూ ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి కేసులు నమోదు చేయకుండా డబ్బులు అడగరు. ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి కాల్స్‌ను నమ్మవద్దని, అలాంటి ఫేక్ కాల్ చేసేవారికి డబ్బులు ఇవ్వొద్దు" అని ఏసీబీ తెలిపింది.
ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి కాల్‌లను స్వీకరించినట్లయితే, వారు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ - 1064 ను సంప్రదించాలని, లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.