వేములవాడలో ఏసీబీ దాడులు

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు

By Medi Samrat  Published on  22 Aug 2024 9:00 AM GMT
వేములవాడలో ఏసీబీ దాడులు

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ రమణమూర్తి, సీఐలు తిరుపతి, కృష్ణకుమార్‌ నేతృత్వంలో ఏసీబీ బృందం అన్నదాన సత్రం, ధర్మశాల, లడ్డూ తయారీ యూనిట్‌, గోడౌన్‌, ఆడిట్‌ విభాగం తదితర విభాగాల్లో తనిఖీలు నిర్వహించింది. పలు రికార్డులను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు. గతంలో కూడా ఆలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ రాజన్న ఆలయంలోని పలు విభాగాలలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో దాడులు జరిపామని తెలిపారు. తూనికలు కొలతలు, ఫుడ్‌ సేప్టీ, ఆడిట్‌ అధికారులతో కలిసి విచారణ చేపడుతున్నామన్నారు. ఇక వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో రద్దీ కొనసాగుతూ ఉంది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Next Story