కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాముపై ఏసీబీ పంజా..ఇంట్లో రూ.20 లక్షల నగదు సీజ్

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

By -  Knakam Karthik
Published on : 18 March 2026 3:00 PM IST

Telangana, ACB, Corruption Case, Karimnagar, Excise CI, Anti Corruption Bureau

కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాముపై ఏసీబీ పంజా..ఇంట్లో రూ.20 లక్షల నగదు సీజ్

కరీంనగర్: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రాముతో పాటు అతడికి సహకరించిన జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు జక్కని వేణును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రాము వేములవాడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ అక్రమ సొమ్మును నేరుగా తీసుకోకుండా, ఉపాధ్యాయుడు వేణు బ్యాంకు ఖాతాల ద్వారా తన కుటుంబ సభ్యులకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. రాము నివాసంలో జరిపిన సోదాల్లో రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది.క అంశాల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ కేసులో తదుపరి న్యాయపరమైన చర్యలను వేగవంతం చేశారు.

Next Story