ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి జ్యోతి అరెస్ట్‌.. ఇంట్లో 4 కిలోల బంగారం, రూ.64 లక్షల పట్టివేత

హైదరాబాద్‌: మాసబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లంచం తీసుకుంటూ దొరికిన అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  20 Feb 2024 12:15 PM IST
ACB, arrest,tribal welfare officer, bribe, Hyderabad

ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి జ్యోతి అరెస్ట్‌.. ఇంట్లో 4 కిలోల బంగారం, రూ.64 లక్షల పట్టివేత

హైదరాబాద్‌: మాసబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. రూ.65 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. జ్యోతి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. నిన్న ట్రైబల్‌ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌లో రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఏడవటంతో సామాజిక మాధ్యమాల్లోనూ దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారి జ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జగా జ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.. ఈమె తన వద్దకు వచ్చిన బాధితుడిని లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం నిన్న మధ్యాహ్నం సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగా జ్యోతి లంచంగా 84 వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని జగజ్ జ్యోతిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మంచి జీతం సంపాదిస్తున్న కూడా... ప్రజలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు. అడపా, దడపా కొన్ని ఇటువంటి సంఘటనలు బయట పడుతున్న, బయట పడని ఉదంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యం గా అవినీతికి పాల్పడే అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నా కూడా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు.. కొన్ని కేసులు కోర్టులో సంవత్సరాల తరబడి వీగిపోతూనే ఉన్నాయి. మరి కొంతమంది బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చి రాజకీయ నాయకుల పలుకుబడితో ఉద్యోగాల్లో చేరి.. యథావిధిగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా కూడా లంచగొండి లలో మాత్రం మార్పు రావడం లేదు.

Next Story