మహేష్ బాబు డైలాగ్‌లా.. ఆయ‌న‌ మైండ్ బ్లాక్ అయింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణునిలాగ ఫాంహౌస్‌లో పడుకున్నార‌ని.. పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫాంహౌస్‌ నుండి బయటకు వస్తా అంటున్నార‌ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

By Medi Samrat  Published on  31 Jan 2025 7:28 PM IST
మహేష్ బాబు డైలాగ్‌లా.. ఆయ‌న‌ మైండ్ బ్లాక్ అయింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణునిలాగ ఫాంహౌస్‌లో పడుకున్నార‌ని.. పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫాంహౌస్‌ నుండి బయటకు వస్తా అంటున్నార‌ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయ‌న స్పందిస్తూ.. కేసీఆర్‌ను పదే పదే మాట్లాడించాలని కుటుంబంలో ప్రయత్నం చేస్తున్నారు.. రాబోయే రోజుల్లో అన్ని బయట పెడతామ‌న్నారు.

కేసీఆర్ గంభీర స్వరంతో మాట్లాడుతున్న అంటుండు.. కానీ చేసిన పొరపాటుకు చింతిస్తూ ఫాంహౌస్‌లో ఉన్నార‌ని అన్నారు. మహేష్ బాబు డైలాగ్ లాగ సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఫాంహౌస్‌కు పరిమితం అయ్యార‌న్నారు. కొంగర మల్లయ్య సామెతలాగ కేసీఆర్ మాట్లాడుతున్నార‌న్నారు. రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించినా.. ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అవకాశం ఇచ్చారు.. కైలాసంలో పెద్ద పాములా మింగి.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చి ఫాంహౌస్‌లో పడుకున్నార‌న్నారు.

కేసీఆర్ బసవేశ్వర్, సంగమేశ్వర గురించి మాట్లాడుతున్నారు.. కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. పద‌మూడు నెలల్లో రైతులకోసం 61 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నార‌న్నారు. పది ఏండ్లు ప్రజా వ్యతిరేక పాలన చేస్తే.. ఇందిరమ్మ రాష్ట్రంలో ఒకోకటి అమలు చేసుకుంటూ వస్తున్నామ‌న్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ స్కిల్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నడిపిస్తుంటే.. బీఆర్ఎస్ దుబాయ్ వేదికగా విద్వేషపు వాట్సప్ యూనివర్సిటీని నడిపిస్తున్నదని ఆరోపించారు.

Next Story