ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

By Medi Samrat  Published on  30 Nov 2024 9:15 AM GMT
ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వారి హయాంలో పేదల భూములను లాక్కొని పెద్దలకు పంచి పెట్టారు. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. మీ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుతున్నామ‌న్నారు. దళిత గిరిజనులకు చెందాల్సిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే దానిని సరిదిద్దడం తప్పా అని ప్ర‌శ్నించారు.

మొన్న కలెక్టర్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల సంఘం స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఆయన భాష వల్ల సిరిసిల్ల ప్రాంతం పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. వాడు వీడు అంటే మేము కూడా వాడు వీడు అనాల్సి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి తాత వరకు ఎందుకు కేటీఆర్.. మొన్నటి ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి మీ అయ్యను కుర్చీలో నుంచి దింపి ఫామ్ హౌస్ కి పరిమితం చేయడాన్నీ మరిచిపోయావా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పంథాలో విమర్శిస్తే మేము స్వాగతిస్తాం.. స్వీకరిస్తాం.. భూతులు మాట్లాడితే మేము మాట్లాడతాం అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వచ్చి సూచనలు సలహాలు ఇవ్వమంటే ఎందుకు రావడం లేదన్నారు.

Next Story